Monday, May 6, 2024
Monday, May 6, 2024

విద్వేషం, హింసతో దేశం బలహీనం: రాహుల్‌

న్యూదిల్లీ: విద్వేషం, హింస దేశాన్ని బలహీనపరుస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. సంతులిత భారత్‌ నిర్మాణానికి భారతీయులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పండుగ వేళ మాంసాహారం వడ్డించడంపై జేఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన హింసను రాహుల్‌ ప్రస్తావించారు. ‘విద్వేషం, హింస భారతదేశాన్ని బలహీనపరుస్తున్నాయి. శాంతి, సామరస్యం, సోదరతత్వం దేశాన్ని ప్రగతిబాటలో నడుపుతాయి. అందుకే సంతులిక భారత్‌ కోసం అందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని రాహుల్‌ ట్వీట్‌ ఏశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img