Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలి


ఆరోగ్య మంత్రిత్వ శాఖ
కరోనా మూడవ వేవ్‌ వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్ని జారీ చేసింది. ప్రస్తుతం ఏ విధమైన అలసత్వానికి అవకాశం ఇవ్వలేమని, ఇప్పటికీ 32% మంది కరోనా నుండి సురక్షితంగా లేరని పేర్కొంది. ప్రజలు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అలాగే సమావేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. పూర్తి టీకాలు వేసిన తర్వాతే ప్రయాణం చేయాలని ప్రభుత్వం తెలిపింది. అంటే, నిర్ణీత విరామం తర్వాత టీకా రెండు మోతాదులను తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయాలని పేర్కొంది. కరోనా నుండి జనాభాలో ఎంత శాతం ప్రజలు రక్షణ పొందగలిగారో తెలుసుకోవడానికి రాష్ట్రాలు స్థానిక సెరో-సర్వేలను కొనసాగించాలని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img