Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

టీకాల కోసం ఫైజర్‌తో చర్చలు


మంత్రి అన్సూక్‌ మాండవీయ
కొవిడ్‌ టీకాల సరఫరా కోసం అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీతో భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం చర్చలు నిర్వహిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్‌ మాండవీయ ఇవాళ లోక్‌సభలో వెల్లడిరచారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను లోక్‌సభలో వివరిస్తూ, ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో కనీసం 20 సార్లు మాట్లాడారని, వారి సూచనల మేరకే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపట్టినట్లు చెప్పారు. రాష్ట్రాలు విఫలం కావడం వల్లే.. జూలై 21వ తేదీన నూరశాతం జనాభాకు వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img