Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

పలు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం

గుజరాత్‌లో 8 మంది మృతి, ముంబైకి ఆరెంజ్‌ అలర్ట్‌
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. దాంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరదనీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌ అంతరాయం ఏర్పడుతోంది. ఈదురుగాలులు, జడివానల దెబ్బకు భారీ చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. న్యూఢల్లీి, ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావారణ శాఖ వెల్లడిరచింది. ప్రతికూల వాతావరణం కారణంగా … విమాన రాకపోకలపై ప్రభావం పడొచ్చని విమానయాన సంస్థ స్పైస్‌ జెట్‌ వెల్లడిరచింది.
భారీ వర్షాల కారణంగా గుజరాత్‌ అతలాకుతలమయ్యింది. 24 గంటల వ్యవధిలో గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా గోడ కూలి ఎనిమిదిమంది మరణించారు. అహ్మదాబాద్‌, రాజ్‌కోట్‌ సహా పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఉరుములు, వరదనీటిలో కొట్టుకొని పోవడం, చెట్లు, కరెంటు స్తంభాలు కూలడం సహా పలు ఘటనల్లో మొత్తంగా 64 మంది మరణించినట్లు అధికారులు వెల్లడిరచారు.ముంబైకి గురువారం వరకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మహారాష్ట్రలో మొత్తం 27 జిల్లాలు, 236 గ్రామాలపై ఈ వర్ష ప్రభావం తీవ్రంగా పడిరది. పలు ప్రాంతాల్లో రానున్న కొద్ది గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ వెల్లడిరచింది. ఇప్పటివరకూ 5,873 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img