Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాల ధాటికి గోదావరి నది పోటెత్తుతోంది.రెండు రాష్ట్రాల్లో గోదావరి వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉంది.తూర్పు గోదావరిజిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలోకి వరదనీరు భారీగా చేరింది. గోదావరి పరవళ్లు తొక్కుతుండటంతో ఆలయ మెట్లపై వరదనీరు ప్రవహిస్తోంది. మరోవైపు ఎగువ నుంచి గోదావరిలోకి వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.3 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ తెలిపింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 13.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదనీరు భారీ మొత్తంలో సముద్రంలోకి వదులుతున్న నేపథ్యంలో కోనసీమ జిల్లాలో అధికార యత్రాంగాన్ని జిల్లా కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి 200 బోట్లను సిద్ధం చేశారు. మరోవైపు భద్రాచలం వద్ద నీటి మట్టం 53.4 అడుగులకు పెరిగింది. దీంతో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరదనీరు పెరగడంతో… భద్రాచలంలోని రామాలయ మాడ వీధులు, అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న దాదాపు 600 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img