Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

అంబేద్కర్‌ కోనసీమ వరదప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటన

వరద బాధితుల పరామర్శ కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డా బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముందుగా పీ గన్నవరం మండలం జి.పెదపూడికి సీఎం జగన్‌ చేరుకున్నారు. వరద బాధితులకు వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. పంటుపై లంక గ్రామాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. అనంతరం అక్కడి నుంచి ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులను కలుస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం చేరుకుని.. వరద బాధితులతో సమావేశం అవుతారు. సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు.. రాత్రికి రాజమండ్రిలోనే సీఎం జగన్‌ బస చేయనున్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img