Friday, May 3, 2024
Friday, May 3, 2024

‘రాష్ట్రపతి’ వివాదం..దద్దరిల్లిన పార్లమెంట్‌

ఇది ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా లైంగికంగా వేధించడమేనన్న నిర్మలా సీతారామన్‌
రాష్ట్రపతి పదవిని అగౌరవపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పార్లమెంట్‌లో బీజేపీ సభ్యులు నిరసనకు దిగి నినాదాలు చేశారు. అత్యున్నత పదవిలో ఉన్న మహిళకు జరిగిన అవమానాన్ని సోనియాగాంధీ ఆమోదించారంటూ స్మృతిఇరానీ గురువారం లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామరామన్‌ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ… అధిర్‌ రంజన్‌ చౌధురి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ ఉద్దేశపూర్వకంగా లైంగికంగా వేధించడమేనని మండిపడ్డారు. కాంగ్రెస్‌ తరపున ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక మహిళ అయివుండి కూడా అత్యున్నత రాష్ట్రపతి హోదాలో ఉన్న మహిళను కించపరిచేలా మాట్లాడేందుకు వారి పార్టీ ఎంపీకి అవకాశం ఇచ్చినందుకు సోనియా క్షమాపణ చెప్పాల్సిందేనని అన్నారు. దేశ ప్రజల ముందుకు వచ్చి సోనియా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపత్ని అంటూ కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరీ వాడినపదం ఈ దుమారానికి దారి తీసింది. కాగా ఈ నిరసనల నేపథ్యంలో ఆయన వెంటనే క్షమాపణలు తెలియజేశారు. ధరల పెరుగుదల, జీఎస్టీ, అగ్నిపథ్‌పై దేశ ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ విషయాన్ని బీజేపీ పెద్దది చేస్తోందని విమర్శించారు. కాగా ఈ నిరసనలపై సోనియాగాంధీ స్పందిస్తూ, ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పారని మీడియాకు వెల్లడిరచారు. కాగా రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తోన్న ముగ్గురు సభ్యులపై నేడు సస్పెన్షన్‌ వేటు పడిరది. ఈ వారం మొత్తం వారు సభకు హాజరయ్యేందుకు అనుమతి లేదు. ఈ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి మొత్తం 27 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వారిలో 23 మంది రాజ్యసభ ఎంపీలు కాగా నలుగురు లోక్‌సభ ఎంపీలున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img