Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వీటెక్‌తో ఏటీఎస్‌ ఎల్గీ తయారీ ఒప్పందం

ముంబయి: ఎల్గీ ఎక్విప్‌మెంట్స్‌ లిమిటెడ్‌ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ, భారతదేశపు అతిపెద్ద గ్యారేజ్‌ పరికరాల తయారీదారు ఏటీఎస్‌ ఎల్గీ స్పెయిన్‌లో వెహికల్‌ టెస్టింగ్‌ ఎక్విప్‌మెంట్‌లో గ్లోబల్‌ లీడర్‌ వీటెక్‌ (వీటీఈక్యూ)తో తన తయారీ ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో, ఏటీఎస్‌ ఎల్గీ భారత మార్కెట్‌కు పోటీ ధరలకు గతంలో దిగుమతి చేసుకున్న వాహన పరీక్ష పరికరాలను తయారు చేయడానికి ప్రపంచ స్థాయి 7500 చదరపు అడుగుల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. పరికరాలు బ్రేక్‌, సస్పెన్షన్‌, స్లిప్‌, స్పీడో టెస్టర్లు, యాక్సిల్‌ ప్లే డిటెక్టర్లు, స్టీరింగ్‌ గేర్‌ ప్లేలను కలిగి ఉంటాయని ఏటీఎస్‌ ఎల్గీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ తివారీ అన్నారు. ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షా కేంద్రాల కోసం భారతదేశంలో వీటెక్‌ వాహన పరీక్ష పరికరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img