Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

తెలుగుజాతి రత్నాలు పింగళి, బళ్లారి

విశాలాంధ్ర – బుచ్చిరెడ్డిపాలెం: తెలుగు జాతి రత్నాలైన పింగళి వెంకయ్య, బళ్లారి రాఘవ ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని బుచ్చిరెడ్డిపాలెం ఎంపిడిఓ డి.వి. నరసింహారావు అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ అభివృద్ధి కార్యక్రమంలో ఆజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. తొలుత పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని రూపకల్పన చేసిన వ్యక్తిగా, స్వాతంత్ర సమరయోధుడుగా, గనుల పరిశోధకులుగా భావితరాలకు మార్గదర్శకంగా పింగళి వెంకయ్య నిలిచారన్నారు. ఆంధ్రప్రదేశ్ నాటక రంగాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తిగా బళ్లారి రాఘవ ఎప్పటికీ గుర్తుండిపోతారని పేర్కొన్నారు. రెండు శతాబ్దాల స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు పరిచయం చేయాలన్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి, మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం. దిలీప్ కుమార్, జిల్లా రిసోర్స్ గ్రూప్ సభ్యులు గండికోట సుధీర్ కుమార్, బ్రహ్మారెడ్డి, మండల పరిషత్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణ

రామచంద్రపురం ప్రాథమికోన్నత పాఠశాల, బెజవాడ బుజ్జమ్మ బాలికోన్నత పాఠశాల, శ్రీ చైతన్య పాఠశాల, విశ్వ భారతి పాఠశాల విద్యార్థులు అల్లూరి సీతారామరాజు పింగళి వెంకయ్య, నెహ్రూ, బళ్లారి, అంబేద్కర్, సరోజినీ నాయుడు, ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో అందరినీ అలరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img