Friday, May 3, 2024
Friday, May 3, 2024

గోరంట్లమాధవ్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలి

పెద్దదోర్నాల లో టిడిపి నాయకులు నిరసన

విశాలాంధ్ర – పెద్దదోర్నాల : సభ్యసమాజాo తలదించుకునేలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్లమాధవ్ ప్రవర్తించిన అశ్లీలవీడియో వెలుగు చూసిన నేపద్యంలో గోరంట్లమాధవ్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని ఆయనకు వ్యతిరేకంగా పెద్దదోర్నాలమండల తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక నటరాజు సెంటర్లో శనివారం నిరసన ప్రదర్శనచేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర తెలుగు యువతఅధ్యక్షుడు శ్రీరామ్ చిన్న బాబు సూచన మేరకు ఎర్రగొండపాలెం నియోజకవర్గటిడిపి ఇంచార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆదేశానుసారం తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలో గోరంట్ల మాధవ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనతెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగు యువతఅధ్యక్షుడు దొడ్డ శేషాద్రి, టిడిపి రైతు సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జడి లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి బట్టు సుధాకర్ రెడ్డి ,నాగేళ్ల.సత్యనారాయణ, దేసు నాగేంద్ర బాబు, తంగిరాల చెన్నారెడ్డి, షేక్ సమ్మద్, ఈదరమల్లయ్య, గుండా రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, చల్ల వెంకటేశ్వర్లు, కాకర్ల శ్రీను, మౌలాలి, కడిమెట్ల శ్రీనివాస్ యాదవ్, చాట్లఏసులు, ఎలకపాటి. చెంచయ్య, అయినముక్కుల దర్శనము దానయ్య ,గోవిందు, సీమారెడ్డి, ఆర్ కృష్ణ, కాకర్లరమేష్, పి మల్లయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img