Friday, May 3, 2024
Friday, May 3, 2024

పొంగుతున్న కాలువలు… నిలిచిన రాకపోకలు

కొయ్యలగూడెం: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండలంలో పలు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామ శివారు బుట్టాయిగూడెం వెళ్ళు రహదారి మధ్యలో ఉన్న పడమటి కాలువ, కన్నాపురం నుండి పోలవరం వెళ్లే తూర్పు కాలువలు ఉదృతంగా ప్రవహించడంతో రహదారిపై ప్రయాణించే వాహనచోదకులకు , ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం నియోజకవర్గంలో ఉన్న ఏజెన్సీ గ్రామాలలో నివసించే గిరిజన ప్రజలు ప్రతిరోజు వారి గ్రామాల నుండి గిరిజన గ్రామాలకు దగ్గర్లో ఉన్న కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పట్టణాలకు వారి అవసరాల నిమిత్తం రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఎవరికైనా అనారోగ్యం సంభవించి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మెరుగైన వైద్యం కోసం ఈ రెండు పట్టణాలకు వస్తూ ఉంటారు. గిరిజన ప్రాంతాలను దాటుకుని కన్నాపురం గ్రామం వచ్చి అక్కడి నుండి కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం వెళుతూ ఉంటారు. వర్షాల కారణంగా కొండలలో నుండి వస్తున్న నీటి ప్రవాహాలు ఎక్కువై కాలువలు ఉదృతంగా ప్రవహించడంతో గిరిజన గ్రామాల నుండి రాకపోకలు చేసేవారికి అంతరాయం ఏర్పడింది. కన్నాపురం, పడమటి కాలువ, తూర్పు కాలువలపై వంతెనలు నిర్మిస్తే రాకపోకలు నిలిచి పోకుండా ఉంటుందని, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఈ కాలువలపై వంతెనలు నిర్మించాలని గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img