Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైద్య పరీక్షలు తనిఖీలు చేసిన డాక్టరు జగన్

విశాలాంధ్ర,పార్వతీపురం: సీతానగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల జోగంపేటలోని డా. బి.అర్.అంబేద్కర్ గురుకులం,
కెజిబివి,ప్రతిభాపాటశాలల వసతి గృహాలను పార్వతీపురం మన్యం జిల్లా ఇంఛార్జి ఇమ్మ్యునైజేషన్ అధికారి, ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్మోహన్ మంగళ వారం ఆకస్మికంగా సందర్శించారు.ఆయా పాటశాలల్లో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న సిక్ రిజిస్టర్లను పరిశీలించి వారికి ఇస్తున్న వైద్యంగూర్చి ప్రిన్సిపాల్ మరియు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా హాస్టల్లో ఉన్న సిక్ రూమ్ లను పరిశీలించి హాస్టల్ సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.సీజనల్ గా వచ్చే వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య సిబ్బంది అవసరమైన పరీక్షలు చేసి, మందులు అందజేసారు.విద్యార్థులందరికీ సీజనల్ గా వచ్చే వ్యాదులపైన, జ్వరాలు మొదలగు వాటిపైన అవగాహన కల్పించారు.వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి కీలక పాత్ర వహిస్తాయని ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహన్ రావు వివరించారు.
ఈకార్యక్రమంలో విద్యా సంస్థలప్రిన్సిపాళ్లు పోల వెంకటనాయుడు, ఈశ్వరరావు, గొట్టాపు హరిత , సీతానగరం పి హెచ్ సి హెల్త్ సూపర్ వైజర్లు ఎం.ఎల్.హెచ్.పిలు, ఏ.ఎన్.ఎంలు హెల్త్ అసిస్టెంట్లు  ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img