Homeజిల్లాలుతూర్పు గోదావరియువనేత నారా లోకేష్ సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి

యువనేత నారా లోకేష్ సూచనలతో పార్టీ బలోపేతానికి కృషి

- Advertisement -

మంగళగిరి టీడీపీ వర్క్‌షాప్‌లో ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని

విశాలాంధ్ర – కడియం : పార్టీ కార్యకలాపాలలో ఆధునికత, క్రమశిక్షణ, ప్రజలతో నిరంతర సత్సంబంధాలు అవసరమని టిడిపి యువనేత నారా లోకేష్ స్పష్టమైన సూచనలు చేశారని, ఆయన సూచనలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఏపిఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ అన్నారు. మంగళగిరి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కీలక వర్క్‌షాప్‌లో ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ పాల్గొని పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ యువనేత నారా లోకేష్ ఇచ్చిన సూచనల మేరకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పార్టీ కార్యకలాపాల నిర్వహణ, భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత దృఢంగా తీసుకెళ్లే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. యువత, మహిళలు, రైతులు వంటి అన్ని వర్గాల ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని మార్గాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే టీడీపీ ప్రధాన లక్ష్యమని, కార్యకర్తలే పార్టీకి నిజమైన శక్తి అని మార్గాని సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఇలాంటి వర్క్‌షాప్‌లు కీలకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు