Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పేద వర్గాల ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే వాసుబాబు

గణపవరం: రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజల అభివృద్ధినే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు) అన్నారు. శనివారం
గడప గడపకు- మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాశిపాడు గ్రామా సచివాలయం పరిధిలో 41 వ రోజు ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తు రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు బాబు మాట్లాడుతూ పేద వర్గాల ప్రజల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించి,జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నామన్నారు.సంక్షేమ పథకాలన్నీ గ్రామ సచివాలయ వ్యవస్థ ,వాలంటరీ వ్యవస్థ ద్వారా గుర్తించి ఇంటి ముంగిటకే అందిస్తున్నామన్నారు.పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నాడు నేడు కార్యక్రమము ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలగా రూపొందించి మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు.గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
పరిష్కారమయ్యే విధంగా అన్ని చర్యలుతీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దండు వెంకటరామరాజు (అర్థవరం రాము), జడ్పిటిసి సభ్యులు దేవరపు సోమలక్ష్మి ,ఎంపీటీసీ సభ్యులు జంపన పద్మావతి, సర్పంచ్ కోట నాగేశ్వరరావు, వైసిపి నాయకులు జంపన రమేష్ రాజు, తహసిల్దార్ బొడ్డు శ్రీనివాసరావు,ఎంపీడీవో గద్ద ల జ్యోతిర్మయి, మండల ఇంజనీర్ ఎం శ్రీనివాస్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img