Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆక్రమణ పై బహిరంగ విచారణ చేయాలి

రాజమహేంద్రవరం: కొల్లేరు ప్రభుత్వ భూముల ఆక్రమణలపై బహిరంగ విచారణ చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, కొల్లేరును పరిరక్షించాలని ఎస్ సి,ఎస్ టి,బిసి, మైనారిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోకల రాజేష్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈతకోట యాకోబు రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారికి కొల్లేరు పరిరక్షణ నిమిత్తం సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భీమడోలు మండలం ఆగడాల లంక, లక్ష్మీపురం గ్రామాలలో అక్రమంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆక్వా సాగు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసిన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదన్నారు. ఆక్రమణదారులు స్థానిక ప్రజాప్రతినిధులను ఏమార్చి కొంతమంది తమకు అనుకూలరైన వ్యక్తులను అడ్డం పెట్టుకుని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని బహిరంగ బహిరంగ విచారణ జరిపితే ఆక్రమణల పర్వం బహిర్గతం అవుతుందన్నారు. కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందన్నారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ప్రభుత్వ భూములను ఆక్రమణలదారుల నుంచి స్వాధీనం చేసుకునే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.

చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ అధికారికి విజ్ఞాపన పత్రం అందిస్తున్న తోకల రాజేష్…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img