Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఈసీ సంచలన నిర్ణయం.. జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ అనర్హతకు సిఫారసు

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల కమిషన్‌ జార్ఖండ్‌ గవర్నర్‌కు సిఫారసు చేసింది. రాష్ట్ర గవర్నర్‌ రమేష్‌ బయాస్‌ వ్యక్తిగత పర్యటనలో భాగంగా సోమవారం నుంచి దిలీల్లో ఉండగా, గురువారం రాష్ట్రానికి తిరిగి రానున్నట్టు ఓ అధికారి తెలిపారు. గవర్నర్‌ తీసుకునే నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ‘‘ఎన్నికల కమిషన్‌ సోరెన్‌ ను అనర్హుడిగా ప్రకటించాలని సిఫారసు చేసింది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారన్నది గవర్నర్‌ పైనే ఆధారపడి ఉంటుంది’’అని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్ర సీఎంగా సోరెన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేయడమే దీనికి మూలంగా ఉంది. సీఎం తన పేరిట స్టోన్‌ చిప్స్‌ మైనింగ్‌ లీజును కలిగి ఉన్నందున ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 9ఏ (కార్యాలయ ప్రయోజనం) కింద సీఎంగా అనర్హుడని బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ, సోరెన్‌ తరఫున న్యాయవాదుల వాదనలను ఎన్నికల కమిషన్‌ బెంచ్‌ విన్న తర్వాత ఈ సిఫారసు చేసింది. మాజీ సీఎం రఘుబార్‌ దాస్‌ ఆధ్వర్యంలోని బీజేపీ బృందం ఈ ఫిర్యాదు చేయడం గమనించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img