Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మట్టి గణపతులనే పూజించాలి : మంత్రులు ఐకే రెడ్డి, తలసాని

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ గణేష్‌ టెంపుల్‌లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీకి మంత్రులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఏటా పంపిణీ చేస్తుందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1.40 లక్షల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌, కలర్స్‌, కెమికల్స్‌తో చేసిన విగ్రహాల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతున్నది. కావున వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణహిత గణపతులకు ప్రాధాన్యమిద్దామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img