Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వరదప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు

విశాలాంధ్ర,సీతానగరం:వరదప్రభావంవల్ల సీతానగరం మండలంలో గండ్లుపడిన రోడ్లు, కాలువలను పూడ్చేందుకు అలాగే నష్టపోయినరైతులకు పంటనష్ట పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అలజింగి జోగారావు అధికారులను ఆదేశించారు.గురువారం ఉదయం ఆయన మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి రామవరం గ్రామాన్ని సందర్శించారు.
గత రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి లింగంచెరువు వాగుఉప్పొంగి ప్రవహించడంతో రామవరం, అంటిపేట గ్రామాల రెవిన్యూ పరిధిలో గల పంట పోలాలు ముంపునకు గురికావడంతో పాటు కాలువలు, రోడ్లుగండ్లు పడిన విషయాన్ని తెలుసుకొని ఆయన సందర్శించారు.ఆకస్మిక వరదప్రవాహానికి గలకారణాలను ఇరిగేషన్ శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు, భారీవర్షాలప్పుడు పైనగల చెరువునుంచి వస్తున్న వాగుప్రవాహం ఉప్పొంగి ప్రవహించడం మూలంగా రామవరం గ్రామందగ్గర్లోని సపటాపైనుంచి వరద ప్రవహించి పంటపొలాలమీదుగా వెళ్ళడం గత కొన్నేళ్లుగా ఉందన్నారు. ఈనీరు  వెంగలరాయ సాగర్ కాలువాలో కలిసిపోవడంవలన పంటపొలాలు మరింత ముంపునకు గురవుతున్నాయని అధికారులు తెలిపారు.వాస్తవ పరిస్థితిని స్వయానా పరిశీలించిన ఎమ్మెల్యే  వెంటనే ఆవాగుపై కాజువానిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి పంపించాలని అలాగే గండ్లుపడ్డచోట అత్యవసరంగా పూడ్పించాలని తెలిపారు.అదేవిగంగా విఆర్ఎస్ కాలువలో వరదనీరు చేరకుండా డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.ముంపునకు గురయిన, ఇసుకమేటలు వేసిన పంటపొలాలను రైతులు వారీగా పక్కగా పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని మండలవ్యవసాయ, రెవిన్యూ అధికారులకు ఆదేశించారు.
ఈకార్యక్రమంలో ఆయనతో తహశీల్దార్ ఎన్వీ రమణ, ఏఓ అవినాష్ తదితర అధికారులు, ఎంపిపి బలగ శ్రీరాములు నాయుడు, జడ్పీటీసీ మామిడిబాబ్జీ, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పి.ఈశ్వరనారాయన, వైసీపీ సీనియర్ నాయకులు బొంగు చిట్టి రాజు, టి.వెంకట అప్పలనాయుడు, అంబటి కృష్ణంనాయుడు, రత్నాకర్,రామకృష్ణ,మహేష్, తిరుపతిరావు, సత్యంనాయుడు తదితరులు పాల్గొన్నారు 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img