Friday, May 3, 2024
Friday, May 3, 2024

డిమాండ్ నెరవేర్చకపోతే సమ్మె తప్పదు

సిపిఐ రాష్ట్ర కార్యవర్గలుసభ్యుల పి. కామేశ్వరరావు
విశాలాంధ్ర విజయనగరం రూరల్

తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మండల తాసిల్దార్ కేంద్రాల వద్ద సివిల్ సప్లైస్ లో పనిచేస్తున్న కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. కామేశ్వరరావు నాయకత్వం వహించారు. ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సివిల్ సప్లై కూలీల రేట్లు పెంచడం ఆనవాయితీగా వస్తుందని అయితే నేటి ప్రభుత్వం కూలి రేట్లు ఒప్పందం సమయం పూర్తయినప్పటికీ కార్మికులను చర్చలకు పిలవకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది 31తో ఒప్పందం పూర్తయిందని, 9 నెలలకు కావస్తున్న నూతన వేతన ఒప్పందం ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. అందువలన ఏఐటియుసిగా వివిధ రూపాల్లో తమ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.గురువారం పనిచేసే ప్రదేశాల్లో నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తామని శుక్రవారం జిల్లాకు సంబంధించిన అన్ని తాసిల్దార్ కార్యాలయాలు వద్ద నిరసన చేపడుతున్నామని తెలిపారు.ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనియెడల 19వ తేదీన అన్ని కలెక్టర్ ఆఫీసుల వద్ద అర్థనగ్న ప్రదర్శన చేపడుతామని అంతకు ప్రభుత్వం ముందుకు రాకపోతే 23వ తారీకు దాటిన తర్వాత ఏ క్షణాన్నైనా సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు కావున ప్రభుత్వం పెద్ద మనసుతో అర్థం చేసుకుని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img