Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉన్నత విద్య-భవిష్యత్తు అవకాశాలు అంశంపై అవగాహన సదస్సు..

ఉన్నత విద్య-భవిష్యత్తు అవకాశాలు అంశంపై అవగాహన సదస్సు..

- Advertisement -

ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి
విశాలాంతర ధర్మవరం;; పట్టణంలోని శ్రీనివాస డిగ్రీ అండ్ పీజీ కళాశాల యందు డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఉన్నత విద్య-భవిష్యత్తు అవకాశాలు అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ముసలి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా ఎస్కే యూనివర్సిటీ ప్రొఫెసర్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ప్రొఫెసర్ జి.వి. రమణ ప్రొఫెసర్ ముని నారాయణప్ప ముఖ్య అతిథులుగా రావడం జరిగిందన్నారు.
సదస్సులోని ముఖ్యాంశా లలో పీజీ సెట్ అవగాహన: డిగ్రీ పూర్తి కాగానే పీజీ సెట్ ఎంట్రెన్స్ పరీక్షలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఆన్‌లైన్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు.

కోర్సుల ఎంపిక: మారుతున్న కాలానికి అనుగుణంగా ఏయే పీజీ కోర్సులు చేస్తే త్వరగా ఉపాధి లభిస్తుంది ఏ విభాగాల్లో ఉన్నత అవకాశాలు ఉన్నాయో ప్రొఫెసర్లు దిశానిర్దేశం చేశారు.
నైపుణ్యాభివృద్ధి: ఉన్నత విద్యలో రాణించాలంటే కేవలం సబ్జెక్టు జ్ఞానమే కాకుండా, విశ్లేషణాత్మక నైపుణ్యాలు కూడా అవసరమని వారు విద్యార్థులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ స్థాయి ప్రొఫెసర్లతో ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించడం తమ కళాశాల ప్రత్యేకత అని కొనియాడారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పీజీ సెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు