Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

యుద్ధానికి ఇది సమయం కాదు.. పుతిన్‌తో మోదీ

యుద్ధం చేయడానికి ఇది సమయం కాదు అని, ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఫెర్టిలైజర్లు, ఇంధన భద్రతా సమస్యలు ఉన్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమరఖండ్‌లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సమావేశంలో పుతిన్‌, మోదీ మాట్లాడుకున్నారు. ఆ సమయంలో యుద్ధం గురించి పుతిన్‌తో మోదీ కామెంట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా అటాక్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఇంధన సమస్యలు ఏర్పడ్డాయి. భారత్‌ వ్యక్తం చేసిన ఆందోళన పట్ల రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పందించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతున్నట్లు పుతిన్‌ తెలిపారు.
వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌ కార్యక్రమానికి ఇండియా తన మద్దతును ఇవ్వలేదు. ఎస్సీవోలో రిలీజ్‌ చేసిన సంయుక్త డిక్లరేషన్‌పై మద్దతు ఇచ్చేందుకు ఇండియా నిరాకరించింది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌, మోదీ మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదు. ఇద్దరూ పబ్లిక్‌గా కనిపించినా.. ఎక్కడా ఆ ఇద్దరూ హ్యాండ్‌షేక్‌ ఇచ్చుకోలేదు. ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు విషయంలో సహకరించిన రష్యా, ఉక్రెయిన్‌ దేశాలకు మోదీ థ్యాంక్స్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img