Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో టీపీసీసీ నేతలకు ఈడీ నోటీసులు
నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి తాజాగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ శాఖ (టీపీసీసీ)కి చెందిన నేతలకు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం నోటీసులు జారీ చేసింది. టీపీసీసీకి చెందిన ఐదుగురు కీలక నేతలను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. ఈడీ నోటీసులు జారీ అయిన వారిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌ రెడ్డిలు ఉన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈ నెల 10న ఢల్లీిలోని తమ కార్యాలయంలో జరగనున్న విచారణకు హాజరు కావాలని వీరిని ఈడీ అధికారులు కోరారు. ఈడీ నోటీసుల విషయంపై స్పందించిన షబ్బీర్‌ అలీ… తనకు ఇప్పటిదాకా ఎలాంటి నోటీసులు రాలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే విచారణకు హాజరు అవుతానని కూడా ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img