Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించాలి : మంత్రి హరీశ్‌రావు

ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు అభివృద్ధి చెందిన దేశాల్లో 7 శాతం, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10 శాతం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించడానికి 3 టైర్‌ సిస్టం ప్రవేశపెట్టామని మంత్రి తెలిపారు. నిమ్స్‌ వేదికగా హాస్పిటల్‌ ఇన్‌ఫెక్షన్‌, ప్రివేన్షన్‌, కంట్రోల్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను మంత్రి హరీశ్‌రావు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని, ఒక ముఖ్యమైన నూతన విధానం వైపు మనం అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ఇన్‌ఫెక్షన్‌ రేటును తగ్గించేందుకు హాస్పిటల్లో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో సూపరింటెండెంట్‌, మైక్రో బయాలజీ హెచ్‌ఓడి, నర్సింగ్‌ హెచ్‌వోడీ ఉంటారని చెప్పారు. ప్రతి సోమవారం మీటింగ్‌ పెట్టుకొని చర్చిస్తారు. అదనంగా ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ ఆఫీసర్‌ (డాక్టర్‌), ప్రత్యేకంగా స్టాఫ్‌ నర్స్‌ను నియమించామని పేర్కొన్నారు. వారికి ఇవాళ శిక్షణ ప్రారంభించుకున్నామని తెలిపారు. ముందుగా టీచింగ్‌ హాస్పిటల్స్‌ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాం. తర్వాత టీవీవీపీ, ఆ తర్వాత పీహెచ్‌సీ సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img