Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ప్రజల భద్రత ఇరాన్‌ రెడ్‌లైన్‌

టెహ్రాన్‌ : ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు పెరగడంతో, ఇరాన్‌ అధ్యక్షుడు హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి ‘‘గందరగోళం’’ కలిగించడానికి ఎవరికీ అనుమతి లేదని దేశవ్యాప్తంగా నిరసనల మధ్య ఇబ్రహీం రైసీ అన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తూ అల్లర్లకు పాల్పడేవారిని అనుమతించం. హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి కఠిన శిక్షలుంటాయి. ఇది ప్రజల నిర్ణయం అని రైసీ స్పష్టం చేశారు. ‘‘అల్లర్లలో పాల్గొన్న వారితో నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి, ఇది ప్రజల డిమాండ్‌’’ అని పేర్కొన్నారు. ‘‘ప్రజల భద్రత అనేది ఇరాన్‌ రెడ్‌ లైన్‌. దీన్ని ఉల్లంఘించడానికి, గందరగోళం కలిగించడానికి ఎవరికీ అనుమతిలేదు’’ అని ఆయన అన్నారు. ఇరాన్‌కు శత్రువైన అమెరికానే ఈ గందరగోళానికి ఆజ్యంపోస్తోందని రైసీ ఆరోపించారు. జాతీయ ఐక్యతను లక్ష్యంగా ప్రజలను ఒకరికొకరు ఎదుర్కోవాలను కుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘స్త్రీ, జీవితం, స్వేచ్ఛ!’’ అని ఇరాన్‌లో నిరసనకారులు నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా మహిళలు వారి తలపై కండువాలు కాల్చారు.
వారి జుట్టును కత్తిరించుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిస్తాన్‌ ప్రాంతంలో కుర్దిష్‌ సాయుధ బలగాలు అశాంతికి ఆజ్యం పోయండంతో ఇరాన్‌ సరిహద్దు క్షిపణి, డ్రోన్‌లతో దాడులను ప్రారంభించింది. అమిని మరణం తర్వాత దాదాపు 60 మంది మరణించినట్లు ఫార్స్‌ వార్తా సంస్థ మంగళవారం తెలిపింది. ఓస్లోకు చెందిన గ్రూప్‌ ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ అణిచివేతలో కనీసం 76 మంది మరణించారని చెప్పారు. ఇరాన్‌లో నిరసనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళనను వెలిబుచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌ ప్రభుత్వ దమనకాండను ఖండిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img