Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అది సీఎం జగన్‌ ముందు చూపుతో కూడిన ఆలోచన: పుష్ప శ్రీవాణి


మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. మూడు రాజధానులు అనేది ముఖ్యమంత్రి జగన్‌ ముందు చూపుతో కూడిన ఆలోచన అని చెప్పారు. అయితే, మూడు రాజధానుల ప్రతిపాదనను రాజకీయాల కోసం అడ్డుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలకు, ఇతర ప్రాంతాల ప్రజలకు మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైనటువంటి అమరావతిని అభివృద్ధి చేయడం కోసం లక్ష కోట్లు అవసరమని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని… ఇలాంటి పరిస్థితుల్లో లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు చెందిన విపక్షాల ప్రజాప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా అమరావతికి మద్దతు పలకాలనుకోవడం దారుణమని అన్నారు. కొంత ఖర్చు పెట్టి విశాఖను అభివృద్ది చేస్తే హైదరాబాద్‌ ను తలదన్నే రాజధాని అవుతుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img