Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఈశాన్య రుతుపవనాల ప్రభావం.. రానున్న మూడు రోజుల్లో ఏపీలో కొన్నిచోట్ల వర్షాలు ..

ఈ నెల 29 నుండి దేశంలో కొన్ని చోట్ల వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతం మీదుగా దిగువ ట్రోపోస్పిరిక్‌ స్థాయిలలో ఈశాన్య గాలులు ఏర్పడే అవకాశం ఉంది. పూర్తి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా ఈశాన్య రుతుపవనాల ప్రభావము వలన దాదాపు 29 అక్టోబర్‌, 2022 నుండి ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశం నందు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడిరచింది. పశ్చిమ మధ్య ,.. దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఇప్పుడు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు తీరంలో సగటు సముద్రంపై 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ మధ్యఉండి కొనసాగుతున్నది. దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి సముద్ర మట్టానికి సగటు 0.9 కి మీ ఎత్తు వద్ద ఉన్నది ఇపుడు బలహీన పడినది. ఈ నేపథ్యంలో ఏపీలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img