న్యూఢల్లీి: భారతదేశంలో సుప్రసిద్ధ కన్స్యూమర్ అప్లయెన్సస్ బ్రాండ్ హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఇటీవలనే తమ శ్రేణి ఉత్పత్తులను తమ వాటర్ హీటర్, రూమ్ హీటర్స్ విభాగంలో విడుదల చేసింది. తద్వారా తమ ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేకోవడంతో పాటుగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెట్లలో తమ స్థానాన్ని పునరుద్ఘాటించనుంది. నూతన ఆవిష్కరణలలో, హింద్‌వేర్ క్వీక్ పోర్టబల్ వాటర్ హీటర్ ఉంది. ఇది వినియోగదారులకు అత్యున్నత స్థాయి ఫీచర్లను అందిస్తుంది. ఈ వాటర్ హీటర్‌లో అత్యున్నత స్ధాయి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. వీటిలో పేటెంటెడ్ సూపర్ సేఫ్ ఇన్నోవేటివ్ షీల్డ్ డిజైన్ బీ బర్న్/ఫైర్ ప్రొటెక్షన్, ఐపీఎక్స్ 7 సర్టిఫైడ్ షాకింగ్ ఫ్రూఫ్, ఆటో-కట్ ఆఫ్ ఫీచర్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఉన్నాయి. సౌకర్యవంతంగా వినియోగించుకునేందుకు ఇది కార్డ్హోల్డ్ర్తో వస్తుంది. యూనిఫార్మ్ స్టాండలోన్ హీటింగ్ అందిస్తుంది.