Friday, May 3, 2024
Friday, May 3, 2024

చెరకు రైతులకు తీపికబురు

ఒకటి,రెండురోజుల్లో రూ.3.87కోట్లు చెల్లింపు : తహశీల్దార్ ఎన్వీ రమణ
విశాలాంధ్ర, సీతానగరం: ఎన్ సి ఎస్ చక్కెర కర్మాగార పరిధిలోని 2019-20,2020-21గానుగసీజన్లో, అంతకు ముందు చెరకురైతులకు చెల్లింపు చేయాల్సిన మిగులు బకాయిలు నేడు లేదా రేపు చెల్లించే అవకాశం ఉందని తహశీల్దార్ ఎన్వీ రమణ చెప్పారు. ఎన్ సి ఎస్ భూములు వేలంపాట పాడిన ధాత్రి రియల్ ఎస్టేట్ సంస్థవారు గురువారంనాడు కోటి 90లక్షల రూపాయలను తహశీల్దార్, షుగర్ కేన్ ఏసిసి ఉమ్మడి ఖాతాలో జమచేసారని ఆయనచెప్పారు. ఇప్పటికే ఖాతాలో 2కోట్ల 30లక్షల రూపాయలుండగా ఈడబ్బులతో 4కోట్ల 20లక్షలకు చేరిందన్నారు. దీంతో రైతులకు చెల్లింపు చేయాల్సిన బకాయిలు 3కోట్ల 87లక్షలు ఉన్నందున దీనిపై జాయింట్ కలెక్టరుకు నివేదించామని ఆయనఆదేశాలుమేరకు ఒకటి,రెండు
రోజుల్లో చెల్లింపులు చేస్తామని తెలిపారు.
ఇదిలాఉండగా మండలములో 520మంది అర్హులైన గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తులు ఇంతవరకుచేసుకున్నారని తహశీల్దార్ ఎన్వీ రమణ చెప్పారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు గ్రామ రెవెన్యూ అధికారులుద్వారా విచారణచేసి స్క్రూటినీ పూర్తిచేసి విశాఖపట్టణం రిటర్నింగ్ అధికారికి పంపిస్తున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ కిరీటి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేష్ విఆర్ఓలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img