Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

కడ్లే గౌరీదేవికి విశేష పూజలు

విశాలాంధ్ర-రాప్తాడు : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం స్థానిక రామేశ్వర ఆలయంలో కడ్లే గౌరమ్మ విగ్రహాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. డప్పు వాయిద్యాలు, నంది డొల్లులతో పండమేరు వంక నుంచి గురువారం ఉదయం జలం తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కడ్లే గౌరమ్మకు సంస్కృతీ, సాంప్రదాయాలకనుగుణంగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో గౌరీదేవికి రుద్రాభిషేకం, కుంకుమార్చన, తమలపాకుల పూజ, వడి బియ్యం సమర్పణ, ఉమామహేశ్వర పూజ, రుద్రాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయం దగ్గర భజనగీతాలు ఆలపించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు అమ్మవారికి గౌరీదేవి రుద్రాభిషేకం, కుంకుమార్చన, నైవేద్యం సమర్పించడంతో పాటు అదే రోజు రాత్రి ఆరు గంటల నుండి మహిళలు, యువతులు మంగళ వాయిద్యాలు నడుమ చక్ర హారతులు కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 6 గంటల వరకు గౌరీదేవిని పూలరథోత్సవంలో విద్యుత్ దీపాలంకరణలో గ్రామ వీధుల్లో మేళ తాళాలు, నంది ధ్వజములు, డొల్లులు విద్యుత్ దీపాలతో ఊరేగించి, ఉదయం 9 గంటలకు గ్రామంలోని పండమేరు వంకలో నిమజ్జనం చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img