విశాలాంధ్ర-రాప్తాడు : ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు, వైసీపీ సీనియర్ నేత తోపుదుర్తి చందు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. రాప్తాడు ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి, జెడ్పీటీసీ హేమావతి, వైసీపీ యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, కన్వీనర్ జూటూరు శేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.