Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

సమాజానికి మానవత్వపు వైద్యులే అవసరం

అనంత ప్రభుత్వ వైద్య కళాశాల సెంట్రల్ హాల్లో 2022వ బ్యాచ్ నూతన మెడికోలకు వైద్య విద్య పరిచయ కార్యక్రమం మరియు తెల్ల కోటు ఉత్సవాన్ని అత్యంత ఘనంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మైరెడ్డి నీరజ అధ్యక్షత న నిర్వహించారు.

ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ మాట్లాడుతూ డాక్టర్ కావాలన్న మీ కలను ఎలా నిజం చేసుకున్నారో, డాక్టర్లే మా ప్రాణాలు కాపాడుతారని కలలుకుంటున్న ప్రజల కోరికలను నెరవేర్చే దిశగా మీ వైద్య విద్యను, పరిశోధనాత్మకంగా, పరిశీలనాత్మకంగా, జ్ఞానవంతంగా, ఆచరణాత్మకంగా మంచి సంస్కారంతో సీనియర్ ఉపాధ్యాయుల సలహాలు, సీనియర్ మెడికోల సలహాలను తీసుకుని మన ప్రభుత్వ వైద్య కళాశాల అనంతపురం గర్వపడే విధంగా మీరు వైద్య విద్యలో రాణించాలని, ప్రథమ సంవత్సరం నుంచే బాగా చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో మొదటి ర్యాంక్ తెచ్చుకుంటే దేశం మొత్తం మన కళాశాల వైపే చూస్తుందని ఆ దిశగా మీ వైద్య విద్య అభ్యసనం ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరిo టెండెంట్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ వైద్యులు గా ఎన్ని కోట్లు సంపాదించాం అన్నది కాకుండా, మన వైద్యం ద్వారా ఎన్ని కోట్ల మంది ప్రాణాలు కాపాడమన్నదే లక్ష్యంగా నీ వైద్య వృత్తి సాగాలని, మంచి మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా, మాట్లాడడంలో మెలకువలు, వ్యక్తిత్వ వికాసం, శరీర భాష ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడే మన దగ్గరకు పేషెంట్లు వస్తారని అందుకే సామాజిక స్పృహ తో మీ వైద్య విద్య అభ్యసించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ లు ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి, ఆచార్య డాక్టర్ షారోన్ సోనియా, వార్డెన్ లు డాక్టర్ శారద, డాక్టర్ సరోజ, డాక్టర్ అబ్దుల్ మజీద్, డాక్టర్ శ్రీనివాసరావు, వైద్యులు డాక్టర్ మీనిగ శైలజ, డాక్టర్ పద్మ శ్రావణి, డాక్టర్ జయమ్మ, డాక్టర్ దుర్గ, డాక్టర్ నాగజ్యోతి, ఇతర డాక్టర్లు, 2022 వ బ్యాచ్ విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ తెల్ల కోటు ఉత్సవంలో పాల్గొన్నారు. నూతన మెడికోలకు ప్రిన్సిపాల్ నీరజ తెల్లకోటులను అందించి, వారితో చరక సంహిత ఓత్ ను హిపోక్రేట్స్ ఓత్ ను ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img