Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బీజేపీ ఎమ్మెల్యేను చితకబాదిన ప్రజలు

కర్నాటకలో ముదిగెరె బీజేపీ ఎమ్మెల్యేను స్థానిక ప్రజలు తీవ్రంగా చితకబాదారు. ఆయన దుస్తులను చింపేశారు. తమకు సమాధానం ఇవ్వకుండా ఎమ్మెల్యే మిన్నకుండి పోవడమే ప్రజల ఆగ్రహానికి కారణమైంది. సెక్యూరిటీ గార్డులను ఆయన్ను కారులో ఎక్కించి క్షేమంగా తరలించారు. ఈ ఘటన చిక్‌మగ్లూరు హల్లెమనే గ్రామంలో జరిగింది.కుందూరుకు చెందిన శోభ ఇటీవల గడ్డి కోసేందుకు వెళ్లగా.. ఏనుగు దాడి చేయడంతో చనిపోయింది. దీనిపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆమె కుటుంబీకులను పరామర్శించేందుకు ముదిగెరె ఎమ్మెల్యే కుమారస్వామి వచ్చారు. బాధిత మహిళ ఇంటి వద్ద గుమిగూడిన గ్రామస్థులు ఆయనను ఇంటిలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏనుగుల దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. దాంతో బిత్తరపోయిన ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా మిన్నకుండిపోయారు. దాంతో మరింత ఆగ్రహించిన ప్రజలు ఆయన చొక్కా చించి కొట్టారు. ఆయన కారును కూడా ధ్వంసం చేశారు. సెక్యూరిటీ గార్డులు కల్పించుకుని ఆయనను కారులో క్షేమంగా పక్కకు తీసుకెళ్లారు. తనపై గ్రామస్థులు పథకం ప్రకారం దాడి చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఎమ్మెల్యే కుమారస్వామి చెప్పారు. ఏనుగుల దాడిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేలోపుగా ఒక వర్గం వారు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఏనుగులు గత కొన్నాళ్లుగా గ్రామాలపై పడి పంటలు నాశనం చేస్తున్నాయని, పలువురిని తీవ్రంగా గాయపరిచాయని స్థానికులు చెప్తున్నారు. ఏనుగులను అదుపుచేసేందుకు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేయాలని తాలూకా కాఫీ గ్రోయర్స్‌ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ కేంద్రాన్ని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img