Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆర్ట్స్‌ కళాశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో, నెహ్రూ యువ కేంద్ర, పొలిటికల్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంట్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం సెమినార్‌ హాల్‌ నందు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్‌ ఏ సి ఆర్‌ దివాకర్‌ రెడ్డి ప్రిన్సిపాల్‌ గవర్నమెంట్‌ కళాశాల, డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ బెస్ట్‌ టీచర్‌ అవార్డు గ్రహీత, నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్‌ ఆఫీసర్‌ సందీప్‌ కుమార్‌, రూడ్‌ సెట్‌ ఫ్యాకల్టీ ఏ నాగేంద్ర ఎన్‌ వై కె డి డి ఓ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జీవన్‌ కుమార్‌, అనంతరెడ్డి లెక్చరర్‌, పొలిటికల్‌ సైన్స్‌, డాక్టర్‌ రంగనాథ్‌ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ముందుగా బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ గ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ…. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మనకు అందించిన రాజ్యాంగం ద్వారా దేశం ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం లౌకికవాదం వచ్చాయని అదేవిధంగా సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి మహిళా సాధికారత కేంద్ర రాష్ట్రాల మధ్య సఖ్యత న్యాయ వ్యవస్థ ఏర్పాటు రాజ్యాంగ సంస్థలు కూడా ఎంతో కీలక పాత్ర పోషిం చారని తెలియజేశారు. కార్యక్రమానికి ముందు వకృత్వ మరియు క్విజ్‌ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన వారికి అతిథులు ద్వారా బహుమతి ప్రధానం తో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమానంతరం అందరూ రాజ్యాంగ పీఠికను చదివి దానిని ప్రతిజ్ఞ గా తీసుకున్నారు కార్యక్రమంలో ప్రగతి పదం యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు నెహ్రూ యువ కేంద్ర జాతీయ యువ కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img