Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్‌ ఫామ్‌ : మంత్రి హరీశ్‌ రావు

అధిక దిగుబడి, అధిక ఆదాయం మంచి భవిష్యత్తు ఉన్న పంట ఆయిల్‌ ఫామ్‌ అని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. అదనపు ఆదాయంకై అంతరపంటలు వేయొచ్చునని, పని తక్కువ ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువగా ఉంటుందని, ఆయిల్‌ ఫామ్‌ పంట సాగుకై రైతులు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కాళేశ్వరం ఫలితంగా ఆయిల్‌ ఫామ్‌ సాగుచేసే రైతులకు అధిక మేలు జరుగుతున్నదని ఆయిల్‌ ఫామ్‌ మొక్కలు నాటడంలో సిద్ధిపేట జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా గతేడాది 3వేలు, ఈ యేటా 3వేలు కలుపుకుని ఇప్పటికే 6300 ఎకరాలు నాటామని, ఈ 2,3 నెలల్లో మరో 4 వేలు ఎకరాలు ప్లాంటేషన్‌ చేయనున్నట్లు మొత్తం 10 వేల ఎకరాలు లక్ష్యంగా ఆయిల్‌ ఫామ్‌ సాగుపై దృష్టి సారించినట్లు మంత్రి హరీశ్‌ రావు వెల్లడిరచారు. నారాయణరావుపేట మండలం బంజరుపల్లి గ్రామ పిట్ల శంకర్‌ 3 ఎకరాల పొలంలో మంత్రి ఆయిల్‌ ఫామ్‌ మొక్కలు నాటారు. ఆయిల్‌ ఫామ్‌ తోటలు పెంపకంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, నెలలో రెండుసార్లు క్రాప్‌ వస్తదని, నెలకు 30వేల చొప్పున యేడాదికి 3 లక్షల 60 వేలు ఆదాయం ఆర్జించొచ్చునని, దీనికి కోతులు, పందులు బెడద లేదని వివరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా సిద్ధిపేట జిల్లాలో జలాశయాలతో ఆయిల్‌ ఫామ్‌ సాగుకు జిల్లా అనుకూలంగా మారిందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో హార్టికల్చర్‌ డీడీ రామలక్ష్మి, సుడా చైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మండల ఏంపీపీ బాలకృష్ణ, వైస్‌ ఏంపీపీ సంతోష్‌, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img