Monday, May 6, 2024
Monday, May 6, 2024

పరిశుభ్రత పై అవగాహన

విశాలాంధ్రó-బొమ్మనహళ్‌: గ్రామాల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారులు గీతా భార్గవి కుమార్‌ రాజులు తెలిపారు శుక్రవారం మండలంలోని ఉద్దేహళ్‌ ఉద్దేహళ్‌ గ్రామాల్లో వైద్య సిబ్బంది ఫ్రైడే సందర్భంగా దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఫ్రైడే డ్రై డే సందర్భంగా గ్రామంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు పరిసరాల పరిశుభ్రత డ్రైనేజీలో దోమలు పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు డ్రైనేజీ కాలువల వద్ద బ్లీచింగ్‌ పౌడర్‌ చెల్లించారు డెంగ్యూ మలేరియా తదితరు సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కోటేశ్వర్‌ రెడ్డి ఆరోగ్య కార్యకర్తలు గోవర్ధన్‌ ఏఎన్‌ఎం జైనా బి ఎం ఎల్‌ హెచ్‌ పి నాగమణి అంగన్వాడి కార్యకర్త కృష్ణవేణి నాగవేణి లక్ష్మి పంచాయతీ కార్యదర్శి మహమ్మద్‌ బాషా ఆశ వర్కర్లు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img