Homeజాతీయంవెలుగులోకి ఉగ్ర కుట్ర

వెలుగులోకి ఉగ్ర కుట్ర

- Advertisement -

గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మంది అరెస్ట్
అహ్మదాబాద్
: గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ఉగ్ర కుట్రలు వెలుగు చూశాయి. ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర బయటపడింది. గుజరాత్ యాంటీ ఉగ్రవాద వ్యతిరేక దళం (టెర్రరిస్ట్ స్క్వాడ్)…గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది. గుజరాత్ ఏటీఎస్ అధికారులు గురువారం గుజరాత్ లోని బనస్కాంత, పటాన్, నవ్సారితో పాటు పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్రాంతంలో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఈ 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అహ్మద్ గాజీవాలా, ఇబ్రహీం ఘాఘా, ముదస్సిర్ గాజీవాలా, జకారియా దురానీ, ముఫ్తీ ఫౌజాన్ దౌవా, మహ్మద్ అమీన్ పాలన్పురి, మహ్మద్ అబ్దుల్ సావ్దీ, బిలాల్ దురానీ ఘాఘాగా గుర్తించారు. వీరిలో ముగ్గురు సిద్ధిపూర్, చిఖ్లీలోని మతపరమైన విద్యాసంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. నిందితులంతా జైష్-ఎ-మహ్మద్ సంస్థ తరఫున యాక్టివ్గా పనిచేస్తూ…గుజరాత్ వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి పని చేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా రిక్రూట్మెంట్లు చేపట్టడానికి ప్లాన్ చేసినట్లు తేల్చారు. అధికారులు అరెస్టైన వారిపై ఉగ్రవాద నిరోధక చట్టాల కింద కేసులు నమోదు చేశారు. వారినుంచి డిజిటల్ పరికరాలు, ఇతర ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద సంస్థతో దేశవ్యాప్త సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు