Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

రైతుల ఆత్మహత్యల నివారణ పై కౌన్సిలింగ్

విశాలాంధ్ర – ఉరవకొండ : పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక ఆర్థిక సమస్యలు, బాధలతో సతమతమవుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల సంఖ్యను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవన రేఖ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయంలో రైతుల ఆత్మహత్యల నివారణ పై గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర పలువురు రైతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమస్యలతో సతమతమవుతూ ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడిన ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని రెడ్స్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంతో ముగ్గురు రైతులను ఉరవకొండ తాసిల్దార్ కార్యాలయానికి పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు అనంతరం ముగ్గురు రైతులకు సంబంధించి ఆర్థిక స్థితిగతులను వారు తెలుసుకున్నారు.ఉపాధి కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డిఎ అడిషనల్ పిడి , మరియు ఉరవకొండ తహసిల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీవో అమృతరాజు. వ్యవసాయ శాఖ సిబ్బంది సిపిఎం, వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img