Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దాహం… దాహం

. బలూచిస్తాన్‌, పంజాబ్‌, సింధ్‌లో తాగునీటి కటకట
. పనిచేయని ఫిల్టరేషన్‌ ప్లాంట్లు
. ఖాళీ బకెట్లతో స్థానికుల నిరసనలు

బలూచిస్తాన్‌: పాకిస్తాన్‌ ప్రజల గొంతు ఎండిపోతోంది. గుక్కెడు మంచినీళ్లు లభించక బలూచిస్తాన్‌లో, పంజాబ్‌, సింధ్‌ ప్రావిన్సుల ప్రజలు అల్లాడిపోతున్నారు. నీటి ఎద్దడి నివారణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా ర్యాలీలు చేపట్టారు. నిర్వహణ లోపం వల్ల ఫిల్టరేషన్‌ ప్లాంట్లు పనిచేయని కారణంగా తాగునీటి కటకట నెలకొన్నదని ఆరోపించారు. బలోచిస్తాన్‌లో కేవలం 25శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతోందని మిగతా ప్రజలంతా ఇబ్బంది పడు తున్నారని నిరసనకారులు తెలిపారు. ఖాళీ బకెట్లు, డబ్బాలతో నిరసన తెలిపారు. పనిచేయని ప్లాంటను అందుబాటులోకి తెస్తే తమ సమస్య తీరుతుందని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటువంటి పరిస్థితులు పాకి స్తాన్‌లో కొత్తకాదు. గతంలో సింధ్‌లో తాగునీటి కొరతకు వ్యతిరేకంగా జియే సింధ్‌ క్వామీ మహజ్‌ (జేఎస్‌క్యూఎం) ప్రదర్శనలు నిర్వహించింది. ఇండస్‌ ఎండిపోవ డానికి పంజాబ్‌ ప్రావిన్స్‌ కుట్రలే కారణమని, నీటి పంపకాల 1991 జల ఒప్పం దాన్ని పంజాబ్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని నిరసనల్లో పాల్గొన్న నేతలు ఆరోపించారు. పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)తో ముడిపడ్డవారికి, రాజకీయ సంబంధాలు ఉన్న ప్రముఖులకు సింధ్‌లో నీరు అందుతోందని, మిగిలినవారు గుక్కెడు నీటి కోసం నానా తంటాలు పడవలసి వస్తోందని నిరసనకారులు ఆరోపించారు. ఒక్క సింధ్‌లోనే కాదు పంజాబ్‌ ప్రావిన్స్‌లోనూ 75శాతం నీటి కొరత ఉంది. ఆ ప్రావిన్స్‌లో 1,27,800 క్యూసెక్కుల నీరు అవసరం కాగా 53,100 క్యూసెక్కులు మాత్రమే సరఫరా అవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img