Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

యువగళానికి మద్దతుగా.. పాదయాత్ర

విశాలాంధ్ర-ఆస్పరి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రకు మద్దతుగా మండల కేంద్రంలో తెలుగు నాడు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి బస్టాండ్ మీదుగా రామతీర్థం క్షేత్రంలోనే గాయత్రీ దేవి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగించారు. అనంతరం గాయత్రీ దేవి, శివాలయం ఆలయాలలో పాదయాత్రలో ఎలాంటి ఆటంకాలు చోటు చేసుకోకుండా దిగ్విజయంగా పూర్తి కావాలని, నారా లోకేష్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత మండల అధ్యక్షుడు రఘు యాదవ్, తాలూక అధికార ప్రతినిధి రాజ్ కుమార్, హనుమంత రెడ్డి, ప్రభాకర్, నాగేంద్ర, లక్ష్మన్న, రంగస్వామి లు మాట్లాడుతూ వంద నియోజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులై జయప్రదం చేయాలని వారు కోరారు. వైసీపీ పాలనలో యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం నింపడమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు వీరేష్, యుగంధర్, మహబూబ్ బాషా, రంగన్న, మారేష్, ఓబులేష్, నరేష్, ఆనంద్, సోము, రాఘవేంద్రలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img