Friday, April 26, 2024
Friday, April 26, 2024

కూలీల సంఖ్య పెంచాలి : ఏపీడి

విశాలాంధ్ర- పెద్దకడబూరు : ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని ఏపీడి లోకేశ్వర్ ఎఫ్ ఏ ను ఆదేశించారు. మంగళవారం పెద్దకడబూరు గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఏపీడి లోకేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉపాధి పనులకు తక్కువ సంఖ్యలో కూలీలు హాజరవుతున్నారని, పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రోజుకు సగటు వేతనం 257 రూపాయలు వచ్చేటట్లు కూలీలతో పని చేయించాలన్నారు. మునుగ మొక్కలు కావాల్సిన వారికి ఇంటింటికి 5 మొక్కలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పొలంలో అయితే ఎకరానికి 450 మొక్కలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీటిలో 200 మొక్కలకు నిర్వహణ ఖర్చుల కోసం ఒక్కో మొక్కకు 15 రూపాయలు చొప్పున నెలకు 3000 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఈ విధంగా 10 నెలల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మునుగ మొక్కలు కావాల్సిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకాలు, జాబు కార్డు, బ్యాంకు అకౌంట్ పుస్తకాలను ఫీల్డ్ అసిస్టెంట్లకు గానీ, ఏపీవోకు గానీ ఇచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఈయన వెంట ప్లాంటేషన్ సూపర్ వైజర్ కృష్ణంరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, మేటీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img