Friday, May 3, 2024
Friday, May 3, 2024

క్యాన్సర్ వ్యాధిని వైద్య చికిత్సలతోనే నివారణ.. రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు

విశాలాంధ్ర -ధర్మవరం : క్యాన్సర్ వ్యాధిని వైద్య చికిత్సలతోనే నివారణ చేయవచ్చునని, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శనివారంఁ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ0ఁ సందర్భంగావిలేకరులతో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించితే ప్రాణాపాయం తప్పుతుందని, ప్రజలందరు అవగాహన తప్పనిసరిగా చేసుకోవాలని, అవగాహన లోపం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అవగాహన తో ముందుగా గుర్తించితే,అధునాతన పరికరాల పద్ధతిలో చికిత్స చేసి నివారించే అవకాశం ఉందన్నారు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది పురుషులకు వస్తుందని, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ ముఖద్వారా క్యాన్సర్ మహిళలకు వస్తాయని తెలిపారు. పురుషులు ధూమపానం పొగాకు వాడుట లాంటివి పూర్తిగా మానివేయాలని సూచించారు. తనవంతుగా ప్రజలకు మరిన్ని వివరాలను కూడా తెలియజేస్తానని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img