Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రష్యా నుంచి ఉక్రెయిన్‌కు 116 మంది యుద్ధఖైదీలు


కీవ్‌: యుద్ధఖైదీలను మార్చుకునే పద్ధతిలో పదుల సంఖ్యలో రష్యా, ఉక్రెయిన్‌ సైనికులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 116 మంది ఉక్రెయిన్‌లోని తమ స్వస్థలాలకు చేరుకున్నట్లు అధ్యక్షుడి కార్యాలయం అధికారి అండ్రి యర్మాక్‌ టెలిగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు. 64 మంది రష్యా సైనికులు ఉక్రెయిన్‌ నుంచి విడుదలైనట్లు అక్కడి అధికారిక వార్తాసంస్థ టీఏఎస్‌ఎస్‌ వెల్లడిరచింది. సైనికుల మార్పు విధానం ప్రకారం ఖైదీలకు విముక్తి కల్పించినట్లు పేర్కొంది. ఇద్దరు బ్రిటిషన్‌ స్వచ్చంధ సహాయకుల మృతదేహాలతో పాటు, ఉక్రెయిన్‌లోని ఇంటర్నేషనల్‌ లీజియన్‌కు చెందిన వలంటీర్‌ సైనికుడిని రష్యా ఉక్రెయిన్‌కు చేర్చినట్లు యర్మాక్‌ తెలిపారు. జనవరి ఆరంభమైనప్పుడు మూడు వేల మందికిపైగా ఉక్రెయన్‌ సైనికులు రష్యా నిర్బంధంలో ఉన్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్యవర్తిత్వం ఫలితంగా యుద్ధ ఖైదీల మార్పిడి జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img