Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలి

: మంత్రి కేటీఆర్‌
రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణలో రెండో హరిత విప్లవం, మత్స్య పరిశ్రమలో నీలి విప్లవం, గొర్రెల పెంపకంతో పింక్‌ విప్లవం, పాడి పరిశ్రమలో శ్వేత విప్లవం ప్రారంభమైందని తెలిపారు. వ్యవసాయరంగంపై మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్‌ సబ్‌ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, వ్యవసాయరంగాన్ని లాభసాటి రంగంగా మార్చాలని తెలిపారు. వ్యవసాయం పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను బలోపేతం చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img