Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

శిధిలావస్థలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రి …

విశాలాంధ్ర-ఆగిరిపల్లి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామంలోనీ,ప్రభుత్వ పశువుల ఆసుపత్రి శిథిలా వ్యవస్థకు చేరుకుంది. సుమారు 50సంవత్సరాలకు పైన ప్రభుత్వ పశువుల ఆసుపత్రి నిర్మించడం జరిగినది. 24 గ్రామాలకు పశువులకు మరి కొన్ని మూగజీవాలకు ఇక్కడే వైద్యం జరుగుతుంది. ఇప్పుడు ఆ ప్రభుత్వ పశు వైద్యశాల శిథిలావస్థలోకి చేరుకొనడం వల్ల పశువులకు, కొన్ని జంతు జీవరాసులకు వైద్యం అందించడం కష్టంగా మారింది. ఇప్పటివరకు ఏ ప్రభుత్వ అధికారి ఆ ప్రభుత్వ పశువైద్యశాలను పట్టించుకోకపోవడం స్థానిక గ్రామ ప్రజలకు, మండలంలోని ఇతర గ్రామ ప్రజలకు సరైన సౌకర్యం అందించలేకపోతున్నారు.అధికారులు పశువుల ఆసుపత్రికి శిధిల వ్యవస్థలో ఉంటే పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. స్థానికులు, మండలంలోని రైతులు ఇక్కడ కొత్తగా ప్రభుత్వ పశువుల వైద్యశాల నిర్మించాలని కోరుచున్నారు, దూర గ్రామాల నుంచి పశువులను తీసుకొచ్చి చికిత్స చేయించుకోవాల్సి వస్తుందని, సరైన వసతులు కూడా సరిగా ఉంటలేదని, ఆ భవనము ఎప్పుడు కూలిపోద్దో తెలియని పరిస్థితిలో ఉందని, ప్రభుత్వ పశువు వైద్యులు కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, వైద్యం చేస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆగిరిపల్లిలో పశువుల వైద్యశాలను కొత్తగా నిర్మాణం చేయాలని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళ్లాలని మండలం, స్థానిక రైతులు ,ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img