Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఉపాధి కల్పించే స్థాయికి ప్రతి విద్యార్థి ఎదగాలి

విశాలాంధ్ర- జేఎన్టీయూఏ: ఇంజనీరింగ్ చదివే ప్రతి విద్యార్థి ఉపాధి కల్పించి స్థాయికి ఎదగాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ పేర్కొన్నారు. బుధవారం అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో చైర్మన్ అనంతరాముడు 15 వ జన్మదిన వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని చైర్మన్ కేక్ కట్ చేశారు. అనంతరం ఉపకులపతి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్, రిటైర్డ్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం, డైరెక్టర్ రమేష్ నాయుడు ,ప్రిన్సిపాల్ డా. వి. మూర్తి రావు ఖోకలే, కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది గజ మాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని సమాజ నిర్మాణానికి, దేశ అభ్యున్నతకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
కళాశాల చైర్మన్ అనంతరాముడు మాట్లాడుతూ.. విద్యార్థుల కలల సహకారానికి నిరంతరం సాధనతో విజయ శిఖరాలను అధిరోహించేందుకు నైపుణ్య ప్రమాణాలు, ఉపాధి కల్పన, ఉజ్వల భవితను అందిస్తున్నామన్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యూహాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో నైపుణ్య ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఉన్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img