Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మహిళల అభివృధ్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వము కృషి

జయమణి, రమాదేవిలు
విశాలాంధ్ర, పార్వతీపురం: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించినపుడే వ్యవస్థ అభివృధ్ధిచెందినట్లని, అటువంటి మహిళల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాముఖ్యతనిస్తూ ఎల్లపుడూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ కమిషన్ మెంబర్, మాజీ ఎమ్మెల్యే సవరపు. జయమణి, రాష్ట్ర దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ రంగుముద్రి రమాదేవిలు తెలిపారు.బుదవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిద్దరూ విశాలాంధ్రతో ముచ్చటించారు. ముందుగా నియోజక, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉండే మహిళా ప్రజా ప్రతినిదులకు,అధికారులకు, ఉద్యోగులకు, నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.మహిళలకు
పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్ వారికి ఆర్థిక,సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో కీలక పాత్ర అందజేసారని తెలిపారు. ఎక్కడైతే స్త్రీకి సముచితమైన స్థానం ఉంటుందో అక్కడ మంచి జరుగుతుందన్న సూక్తిని ముఖ్య మంత్రిగా జగన్ అమలు చేసి ప్రభుత్వంలో కీలకమైన మంత్రి పదవులు మహిళా మణులకు ఇవ్వడమేగాక అన్ని పదవుల్లో కీలకస్థానం కలిపించారని కొనియాడారు. మహిళల రక్షణకు దిశ వంటి చట్టాలను అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహిళలకి అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకుంటున్న ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img