Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎప్పటికైనా జనసేన ప్రభుత్వం

. వైసీపీని గద్దె దించటమే లక్ష్యం: పవన్‌ కళ్యాణ్‌
. ఉత్సాహంగా జనసేన 10వ ఆవిర్భావ సభ
. లక్షలాది మంది హాజరు

విశాలాంధ్ర –మచిలీపట్నం: రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించటమే లక్ష్యంగా జనసైనికులు పని చేయాలని జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ ఉత్సాహపూరిత వాతావరణంలో కార్యకర్తల కోలాహాలం మధ్య మచిలీపట్నంలో మంగళవారం జరిగింది. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ విజయవాడ నుంచి ఊరేగింపుగా మచిలీపట్నం చేరు కున్నారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహానీయుల త్యాగాలను దృష్టిలో పెట్టుకుని మన ఏమైనా చేద్దాం అనే ఆశయంతో పార్టీని స్థాపించినట్లు చెప్పారు. రెండు చోట్ల ఓడిపోయి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ల టానికి మహనీయుల స్ఫూర్తితోనే ధైర్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. గెలిచి బలపడటం కాకుండా ఓటమి దెబ్బలు తిని కూడా బలపడటం జనసేనకే సాధ్యమయిందన్నారు. పులివెందులతో సహా రాష్ట్రంలో వేలాది మందిని పార్టీ కోసం పని చేసే వారిని సంపాదించుకోగలిగామని అన్నారు. సభ ప్రారంభా నికి ముందుగా ఇటీవల మరణించిన కౌలు రైతుల కుటుంబాలను కలిసి వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించారు. ముందుగా జనసేన పార్టీ రాజ కీయ వ్యవహార కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రజల కోసం చేపట్టిన ఉద్యమాలను వివరించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను తూర్పారబట్టారు. నవరత్నాలు, ఉత్తరాంధ్ర ప్రజల వలసలు, జీవో నంబరు1 గురించి వివరించారు. సోషల్‌ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం పెరిగిందని, ఈ ఏడాది 6,69,350 మంది సభ్యత్వం తీసుకున్నారని తెలిపారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img