Thursday, October 24, 2024
Thursday, October 24, 2024

ఉత్సాహాం ఉరకలేసిన వేళ యువత కేరింత….

శ్రీవాసవిలో సందడిగా సాగుతున్న టెక్- యుఫోరియా2కె23…

విశాలాంధ్ర- తాడేపల్లిగూడెం: శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ప్రారంభమైన మూడు రోజుల సాంకేతిక సింపోజియం రెండవ రోజు అద్యంతం విద్యార్థుల ఉల్లాస ఉత్సాహాల మధ్య సందడిగా సాగింది. రెండవ రోజు కార్యక్రమాలలో భాగంగా కొన్ని విభాగాలలో ప్రాజెక్ట్ ఎక్స్పో, మీలో ఎవరు జీనియస్, స్పాట్ ఫోటోగ్రఫీ , షార్ట్ ఫిల్మ్ మేకింగ్, యాడ్ మేకింగ్, కవిత్వం, కళా ప్రదర్శన, క్యాప్చర్ ద యుఫోరియా తదితర వాటిలో పోటీలను నిర్వహించారు. సాయంత్రం వరకు వివిధ విభాగాలలో జరిగిన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో తమ కేరింత లతో సందడి చేసారు. కళాశాల పాలక వర్గ అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావులు మాట్లాడుతూ దాదాపు 25కు పైగా కళాశాలల నుండి 1800 మంది విద్యార్థులు సాంకేతికోత్సవ పండుగలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలకు ఆధునిక సాంకేతికతను జోడించి అధ్భుత ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని సూచించారు. కళాశాల పూర్వ విద్యార్ధి వర్ధమాన యూట్యూబర్ రవి సాయి తేజ విద్యార్థులతో కలిసి సందడి చేసారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ మీలోని టాలెంట్ ను బయట పెట్టడానికి అడ్డుపడే భయాన్ని, బిడియాన్ని విడిచి పెట్టాలని, అప్పుడే మీరు విజయం వైపు అడుగులు వేయగలరని తెలిపారు. చాలా మంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ వుంటారని, మీలోని అంతర్గత నైపుణ్యాన్ని ప్రదర్శించగలిగితే అవకాశాలు వాటాంతట అవే వస్తాయని తెలుసుకోవాలన్నారు. కో ఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ సింపోజియంలో భాగంగా వివిధ విభాగాలలో 38 అంశాలలోనూ, కళాశాల స్థాయిలో 7 అంశాలలోను పోటీలు నిర్వహిస్తున్నామని ఈ రోజుతో కొన్ని ముగియగా క్రీడా, కల్చరల్ విభాగాలలో పోటీలు రేపు కూడా జరుగుతాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థులతో సమావేశం తదితర వాటిని రేపు నిర్వహిస్తామన్నారు. విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img