Friday, April 26, 2024
Friday, April 26, 2024

వైద్య విద్యార్థులు సేవా దృక్పథంతో పనిచేయాలి….

వాటికన్ రాయబారి పోర్డ్ జెరెల్లి…

విశాలాంధ్ర -ఏలూరు: డెంటల్ కళాశాల వైద్య విద్యార్థులు డిగ్రీ పూర్తి అయిన తరువాత సేవా దృక్పథంతో పనిచేయాలని వాటికన్ రాయబారి లియోఫోర్డ్ జరెల్లి అన్నారు. దుగ్గిరాల సెయింట్ జోసెఫ్ దంత కళాశాల యందు వాటికన్ రాయబారి లియో పోర్డ్ జెరెల్లి పర్యటన సందర్భంగా ఆయనకు, ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర, ఏలూరుపేట రికార్డ్ జనరల్ పి. బాల, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులకు, కన్య స్త్రీలకు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాల అలంకారంతో ఊరేగింపుతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాలు కళాశాల కరస్పాండెంట్,సెక్రటరీ మోజెస్ ఆధ్వర్యంలో జరిగాయి. కళాశాల యందు వాటికన్ రాయబారి లియోఫోర్డ్ జెరెల్లి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోమన్ క్యాథలిక్ సంబంధించిన కళాశాల భారతదేశంలోని మొదటి దంత కళాశాలఅన్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉంటారని, ఉత్తమ వైద్యులుగా తయారవుతారని వారు ఉన్నతమైన స్థానాల్లో క్రమ శిక్షణతో పెరుగుతారని కొనియాడారు. ఈ సంస్థ నడుపుతున్న బిషప్ జయ రావుకి, కరస్పాండెంట్ మోజెస్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ స్లీవ రాజు, కళాశాల అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ ఫెలిక్స్. నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్ ఫా. జాకబ్ ఏలూరు పీఠం లో వివిధ ప్రాంతంలో పనిచేస్తున్న గురువులు, కన్య స్త్రీలు, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img