Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ

సైకిల్ షెడ్ లేక విద్యార్థులు అవస్థలు….

విశాలాంధ్ర- వీరవాసరం: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నాడు నేడు ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థలలో వసతులు కల్పిస్తున్నా పూర్తి స్థాయిలో కనీస వసతులు ఏర్పడటం లేదని సర్వత్రా ఆరోపణులు వెల్లువెత్తుతు న్నాయి. అంతేకాకుండా పాఠశాలలో కొంతమంది ఉపాద్యాయుల ప్రవర్తన విద్యార్థిని, విద్యార్థుల పట్ల విచిత్రంగా ఉంటుందని, కొంతమంది ఉపాద్యాయులు ఎప్పుడు పడితే అప్పుడు పాఠశాలకు రావడం, విద్యార్థులకు విద్యాబుద్ధులు, ఆటపాటలు అంతంత మాత్రంగానే చెబుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కడో కాదు మండల కేంద్రం వీరవాసరం జెడ్పీ ఉన్నత పాఠశాలలోనిది. సైకిల్ షెడ్ లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు మధ్యాహ్న భోజనం తినడానికి కూడా విద్యార్థిని, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో సుమారు 800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలా మంది సైకిళ్లపైనే పాఠశాలకు వస్తుంటారు. వీరు సైకిళ్లు నిలుపుకోవడానికి షెడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అవి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాడైపోతున్నాయి. ఈనేపథ్యంలో సైకిళ్లు తరచూ రిపేర్లకు గురవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు.
సుమారు 30 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో
సంవత్సరాలు గడుస్తున్నా సైకిల్ షెడ్ల నిర్మాణ ఊసే లేదని తల్లిదండ్రులు అంటున్నారు. దీంతో విద్యార్థులు ఆరుబయటే సైకిళ్లు పెట్టకుంటున్నారు. కొందరు విద్యార్థులు కొబ్బరి చెట్లనీడలో పార్కింగ్ చేసుకుంటున్నారు. సైకిళ్లకు రక్షణ లేకపోవడంతో తరచూ పాడైపోతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. సైకిల్ షెడ్ నిర్మాణానికి, మధ్యాహ్న భోజనం తినడానికి కూడా విద్యార్థిని, విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ఉంటున్నారని, వీటితోపాటు చదువు, ఆటపాటల పట్ల కూడా పాఠశాల ఉపాద్యాయుల, అధికారులు ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదే స్కూల్ లో చదివి మంచి వృద్ధిలో ఉన్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు గ్రామంలో ఉన్నారని సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాఠశాల ఉపాద్యాయులు స్పందించి సైకిల్ షెడ్లు ఏర్పాటు చేసి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఆరుబయటే పెట్టుకుంటున్నాం…

పాఠశాల ఆవరణలో సైకిళ్లు పెట్టుకోవడానికి షెడ్డు లేకపోవడంతో సైకిళ్లు ఆరుబయటే పెట్టుకుంటున్నామని, దీంతో సైకిళ్ళు తరచూ పాడైపోతుండంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థిని విద్యార్థులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img